ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై చర్య తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం ఇచ్చిన ఆదేశాలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) స్వాగతించింది. హైకోర్టు తీర్పు అధికార కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. “ఈ తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామిక పద్ధతులకు గణనీయమైన ఎదురుదెబ్బ. పార్టీ మారిన వారు అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని స్పష్టంగా తెలియజేస్తోంది. న్యాయస్థానం తీర్పు ప్రజాస్వామ్యానికి దక్కిన…
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) స్పోర్ట్స్ అకాడమీల్లో నిమగ్నమైన క్రీడా కోచ్‌ల సేవలను కొనసాగిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. తమ కోచ్‌లను ఆకస్మికంగా తొలగించడం వల్ల ప్రతికూలంగా ప్రభావితమైన విద్యార్థుల దుస్థితి సెప్టెంబర్ 6న ఈ కాలమ్‌లలో హైలైట్ చేయబడింది. సొసైటీ 28 క్రీడా అకాడమీలను నిర్వహిస్తోంది, గోల్ఫ్, క్రికెట్, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్ , జూడోతో సహా 12 విభాగాలను అందజేస్తూ 35 మంది కోచ్‌ల సేవలను గౌరవ వేతనం ఆధారంగా…
వచ్చే నాలుగు వారాల్లోగా ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. పార్టీ ఫిరాయింపులపై ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తీర్పు ‘చెంపదెబ్బ’ అని ఆయన అభివర్ణించారు. కేటీఆర్ సోమవారం ఒక ప్రకటనలో, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించి, ప్రజాస్వామ్య…
హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం ఈ తీర్పు పై పూర్తి అధ్యయనం చేయాల్సి ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పే తుది తీర్పు కాదు దీన్ని తుది తీర్పుగా భావించి ఉప ఎన్నికలు వస్తాయని కొన్ని పార్టీలు పండుగ చేసుకుంటున్నాయని, కానీ వారికి ఇంకా పైనా చాలా కోర్టులు ఉన్నాయన్న విషయం ఆ పార్టీ వాళ్లు విస్మరిస్తున్నారన్నారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై డబుల్ బెంచ్‌కి వెళ్ళొచ్చు సుప్రీంకోర్టుకెళ్లొచ్చు ఇలా చాలా…
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలపై దిశ నిర్దేశం చేశారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో.. 1, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం – 15 రోజుల లోపల ప్రసవం ఉన్న గర్బిణి మహిళల సంక్షేమానికై తీసుకున్న ముందస్తు చర్యలపై చర్చించారు. మందులు వాటి నిల్వల స్థితి. ఆసుపత్రులకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు. అత్యవసర వాహనాల అందుబాటు. టీకాలు, పారిశుద్ధ్యం –…
వరంగల్ లో పసికందు మిస్సింగ్ ఘటన కలకం రేపుతోంది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సోనాపొర్ గ్రామమానికి చెందిన రాజేష్ – భీమ్ బాయ్ దంపతుల బాబు వరంగల్ లో మిస్సింగ్ అయ్యాడు. ఈ నెల నాలుగవ తేదీన మంచిర్యాలలో డెలివరీ అయింది భీమ్ బాయ్. అయితే.. 7 నెలలకే బాబుకు జన్మనిచ్చింది భీమ్ బాయి. నెలలు నిండని శిశువు ఆరోగ్యంపైన వైద్యులు భరోసా ఇవ్వలేదు. దీంతో.. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కి తీసుకెళ్లడంటూ డెలివరీ సమయంలో…
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనానికి జీఎహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసిందని, నగరంలో గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్దలతో.. ప్రశాంత వాతావరణంలో జరుపుకకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంలో బాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు మేయర్ వెల్లడించారు. జీహెచ్ఎంఎసీ ప్రతి ఏటా నిమజ్జనం కొరకు తమ సమీప ప్రాంతంలో నిమజ్జన కొలనులను (పాండ్) లను 73 లోకేషన్లలో వివిధ రకాలైన పాండ్ లను ఏర్పాటు చేసారు. ముఖ్యంగా బేబీ…
హైదరాబాద్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. దేశ హితం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని ఆమె కొనియాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ నీ… ఇప్పుడు అధికారం లో ఉన్న పార్టీ నీ చూస్తున్నామని, రాష్ర్ట అభివృద్ది నీ కుంటుపడేలా చేస్తున్నారని, 2047 వరకు ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని లక్ష్యం తో మోడీ పని చేస్తున్నారన్నారు డీకే అరుణ. ఎందుకోసం తెలంగాణ కావాలని…
హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. టార్గెట్ కంటే ఎక్కువ సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలు, నేతలకు పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మభ్యపెట్టి, ఆశపెట్టి సభ్యత్వ నమోదు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ మిగతా పార్టీలకు తేడా ఉందని, కొన్ని రాజకీయ పార్టీలు సభ్యత్వ నమోదు చేస్తే ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ కన్నా.. దేశమే గొప్పదని చెప్పే పార్టీ కేవలం బీజేపీ మాత్రమే…
హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని హైడ్రా ప్రకటించింది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని, కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని హైడ్రా పేర్కొంది. ఇప్పటికే నిర్మించి నివాసం ఉండే ఇళ్లను కూల్చమని హైడ్రా వెల్లడించింది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అయితే.. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలు , లేఅవుట్లు హైడ్రా తొలగించింది. హైదరాబాద్ ట్రైసిటీలోని చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో…