తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్-అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణను చూసుకుంటుంది. అయితే.. అక్రమ నిర్మాణల కూల్చివేతలపై బుధవారం హైడ్రా వివరాలు వెల్లడించింది. మొత్తం 111.72 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా పేర్కొంది. ఇందులో భాగంగా జూన్ నుంచి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోతున్న హైడ్రా కూల్చివేతల వివరాలను విడుదల చేసింది.…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో పర్యటిస్తూ భారత్ ను కించపర్చడమే కాకుండా ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తున్న రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. ‘‘మిస్టర్ రాహుల్ గాంధీ… క్విట్ ఇండియా’’ అని నినదించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని చెప్పిన బండి సంజయ్… అందరూ కలిసి పోటీ చేసినా ఈసారి జీహెచ్ఎంసీపై కాషాయ…
రామప్ప దేవాలయానికి గొప్ప చరిత్ర ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. అందుకే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిందని, తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయమన్నారు సీతక్క. అందుకే రామప్ప కీర్తిని చాటేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు. పనుల్లో అలసత్వం వహిస్తే చరిత్ర, ప్రజలు క్షమించరని, రామప్ప చుట్టుపక్కల ఎన్నో చారిత్రక ప్రాంతాలు, టూరిజం…
Earthquake: ఢిల్లీ-ఎన్సీఆర్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. అందిన సమాచారం మేరకు భూకంప కేంద్రం పాకిస్థాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు భూకంపం సంభవించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదిక ప్రకారం, ఖైబర్ పఖ్తుంక్వా నుండి పంజాబ్ వరకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది.…
రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… చాకలి ఐలమ్మ స్పూర్తితో ఇందిరాగాంధీ భూసంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ధరణి పేరుతో పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేశారునరి ఆయన ఆరోపించారు. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని…
యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ దరఖాస్తు చేసిన 4 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఆదేశించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం లేఖ పంపించింది. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం 200 సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలకు…
సమన్వయ ప్లాట్‌ఫాంలో నేర విశ్లేషణ మాడ్యూల్ అభివృద్దిలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ చూపిన ప్రతిభకుగానూ కేంద్ర హోం శాఖ అవార్డును ప్రదానం చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) మొదటి ఆవిర్భావ దినోత్సవాన్నిఢిల్లీ విజ్ఞాన్ భవన్లో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అవార్డును స్వీకరించారు. నేర గణాంకాల విశ్లేషణ, నేరాల మధ్య ఉన్న…
రాజేంద్రనగర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఆపరేషన్ నిర్వహించి అంతరాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారని డీసీపీ రాజేంద్రనగర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద గంజాయి తరలిచే ముఠాను పట్టుకున్నామని ఆయన తెలిపారు. ముఠా లోని ఐదుగురు నిందితులను పట్టుకున్నామని, సచిన్ ఠాగూర్ సింగతో పాటు వినోద్ అనే వ్యక్తలు ఈ ముఠా లో కీలక నిందితులు అని ఆయన పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి గత ఐదు సంవత్సరాలుగా గంజాయి…
రాష్ట్రానికి కావాల్సిన అంశాలను కమిషన్ ముందు పొందుపరిచామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కమిషన్ ముందు అర్బన్ డెవలప్మెంట్ పై దాన కిషోర్, ఇతర అంశాల సీఎస్ శాంతకుమారి ప్రజెంటేషన్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కు ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండాలని కోరాని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం తయారీ పథకాలకు అనుమతి ఇవ్వాలని కోరామని, ధనిక రాష్ట్రం అయిన తెలంగాణను గత ప్రభుత్వాల…
పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ స్వయంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తినని క్లారిటీ ఇచ్చారని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంని కలిశానని అరికేపూడి అన్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టు పరిధిలో ఉంది దాని మీద స్పందించమని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హతకి ప్రక్రియ మొదలు పెట్టమంది.. నిర్ణయం తీసుకోమని చెప్పలేదన్నారు. అభివృద్ధి కోసం మా పార్టీ లోకి వస్తాం…