కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ మారే వ్యక్తి ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యేనన్నారు. ఇప్పటి వరకు చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించానని, ఎక్కడా కూడా ఇంత వెనుకబడి పరిస్థితి కనిపించలేదన్నారు వెంకట రమణ. రాజకీయం వేరు..పరిపాలన వేరని, మంత్రి గా ఉన్న జూపల్లి నోరు జారీ మాట్లాడుతున్నాడన్నారు. పేరు కృష్ణా రావు.. కానీ…
కొత్త బిచ్చగాడు పొద్దేరుగడన్నట్లు ఉంది..ఇప్పుడు కొత్తగా మంత్రులు అయ్యిన వారు పరిస్థితి అంటూ విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్. ఇవాళ పెద్ద కొత్తపల్లి కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి అయ్యామని అద్ధూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని, ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది.. వీళ్ళ మారుస్తున్న రంగులు చూసి అంటూ ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో లేని కాంగ్రెస్ గల్లీ లో ఎందుకు అంటూ ఆయన విమర్శలు…
తుక్కుగూడలో సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను రాష్ట్ర ప్రజలకు అంకితం ఇచ్చారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గృహాలక్ష్మీ, మహా లక్ష్మీ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ఎలా ఇచ్చారో ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తామన్నారు. రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పథకాల అమలు కోసం ఆర్థిక వెసులుబాటు అంచనా వేసుకున్నామని, చేవెళ్లలో ఈ కార్యక్రమం లక్ష మంది మహిళాల సమక్షంలో…
కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తెలంగాణలో మరో రెండు పథకాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఎవరూ మర్చిపోలేని రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. తెల్లకార్డు ఉన్న వారికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గత మూడేళ్ళుగా యావరేజ్ గా ఎన్ని సిలిండర్లు వాడారో అన్ని సిలిండర్లు ఇస్తామని ఆయన వెల్లడించారు. సుమారు 40 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని, భవిష్యత్ లో తెల్ల కార్డు…
ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పథకాలను అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపే అమలులోకి తీసుకువచ్చింది. అయితే.. మిగిలిన పథకాల్లో రెండు పథకాలను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లు ప్రకటించిందని, విప్లవాత్మక ఆలోచనలతో కూడిన నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకుందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తోందా అని రాష్ట్రం వైపు దేశం చేస్తోందని, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్…
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి) మండలం వెంకట్రావుపేట గ్రామంలో సోమవారం రాత్రి సాయిబాలాజీ ఆగ్రో రైస్ మిల్లులో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి 69,394 బస్తాల వరి ధాన్యం స్వాహా చేసినట్లు గుర్తించారు. ఆ ధాన్యం విలువ రూ.5.90 కోట్లుగా అంచనా వేశారు. 2022-2023 రబీ సీజన్లో 38,265 బస్తాలకు గాను 2,174 బస్తాలను మిల్లింగ్‌కు కేటాయించగా, 42,301 బస్తాలకు 42,302 బస్తాలకు గాను కేవలం 122 బస్తాలు ఇచ్చామని విజిలెన్స్ జిల్లా…
గోషామహల్ జుమ్మారత్ బజార్ లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 5 విజయ సంకల్ఫ యాత్రలు జరుగుతున్నాయని, కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది నుండి, మరోటి వికారాబాద్ జిల్లా తాండూర్ నుండి, 3వది సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో బాసర నుండి, 5 వది భద్రాచలం రాముల వారి చెంత నుండి యాత్రలు ప్రారంభమైందన్నారు. మార్చీ 2 యాత్రలు ముగుస్తాయని ఆయన పేర్కొన్నారు.…
తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి రెవెన్యూ, ఇరిగేషన్, ఐటీ, పరిశ్రమల శాఖలో అక్రమాలు జరిగాయని ఎన్నో కథనాలు వచ్చాయన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం తో అవినీతి పెరిగిపోతోందని, కాంగ్రెస్ ఇన్చార్జి ల పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మాణిక్ రావు ఠాక్రే, ఠాగూర్ లపై ఆధారాలు ఉన్నాయని చెప్పారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవ్వరిపై కూడా…
హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి బుపెంద్ర భాయ్ పాటిల్ కి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏప్రిల్ మొదటి వారం లో ఎన్నికలు జరుగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరైతే దేశాన్ని ముందుకు తీసుకుపోతుందో.. ఎవరి నేతృత్వంలో అవినీతి రహిత దేశం ఏర్పడుతుందో ఆలోచించి ఓటు వేయాలని ప్రజల్ని కోరుతున్నానన్నారు.
సింగరేణి సంస్థల్లో పని చేసే 43 వేల మందికి ప్రమాద వశాత్తు ఏదైనా జరిగితే కోటి రూపాయల భీమా వర్తించే పథకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంక్షేమ రాజ్యానికి సాక్ష్యం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీలతో పాటు సింగరేణి కార్మికులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నామన్నారు. కార్మికులను కాపాడుకోవడం మా భాద్యత అని ఆయన అన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల కు కూడా 20 నుంచి 30 లక్షల ఇన్సూరెన్స్ చేయించామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి…