రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. డిమాండ్ కు సరిపడేంత విద్యుత్తు అందుబాటులో ఉందని, కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. రోజురోజుకు ఎండలు మండుతుండటం విద్యుత్తు డిమాండ్…
జగిత్యాల జిల్లా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నిజామాబాద్ ఎంపీగా ఒకసారి కవితకు , ఒకసారి ధర్మపురి అరవింద్ కు అవకాశం కల్పిస్తే ముత్యపేట చక్కర కర్మగారాన్ని తెరిపించలేకపోయారన్నారు. ముత్యంపేట చక్కర కర్మగారం మూతపడటంలో బీఆర్ఎస్, బిజెపి రెండు పార్టీల పాత్ర…
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ, మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఏమి చేయలేదని దుష్ప్రచారాలు చేశారు కేసీఆర్ అంతా మేమే ఇస్తున్నామని దుష్ప్రచారం చేశారన్నారు. ఉచిత బియ్యం కూడా నేనే ఇస్తున్నానని ప్రచారం చేశాడు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. రైతులకు మద్దతు ధర నేనే పంపిస్తాను అన్నాడని, స్థంబాలకు లైట్ బుగ్గలు నేనే ఇస్తున్న అన్నాడు…
ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలను చంపేద్దామనుకుంటున్నారా? 3 ఏళ్లుగా రూ.7 వేల 800 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలా? విద్యార్థులను రోడ్డున పడేస్తారా? అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వ్రుత్తి విద్యా కళాశాలల పరిస్థితి దుర్భరంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఫీజు రీయంబర్స్ మెంట్ట్ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్. ఇవాళ ఆయన పెద్దపల్లిలో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ఏ ప్రాంతం చూసిన రైతుల కష్టాలు కనబడుతున్నాయన్నారు. తుల పంట పొలాలు ఎండుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. రైతుల కోసం 36 గంటల నిరసన దీక్షను చేపట్టామని, ఈ దీక్ష తోనైనా ఎండిన పంటలకు ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.…
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వమే ఈ దేశానికి శ్రీ రామ రక్షా అని అన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో డీకే అరుణ ఆధ్వర్యం లో వెయ్యి మంది కార్యకర్తలు పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఐదో సంపన్న దేశంగా భారత దేశాన్ని ఉంచిన ఘనత ప్రధాని మోడీ ది అని,…
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల కాలంలో కే.కేశవరావు, కడియం శ్రీహరిలు అనేక పదవులు అనుభవించి బీఆర్ఎస్ పార్టీని వీడడం సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అని ఆయన అన్నారు. కే.…
పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టింది..గతంలో తనను కేసీఆర్ కోడితే .. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కొట్టినట్లుగా పరిస్థితి మారిందని.. మరలా తన జోలికి వచ్చిన.. ఎగిరేగిరి పడిన వారిని అదే గతి తప్పదంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు.. మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు ఆశించి బంగపడ్డ మల్క కోంరయ్య కుటుంబన్ని ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.. ఇన్నాళ్లు గా పార్టీని బలోపేతం చేయడానికి వారు చేసిన వర్క్ ను అభినందించడంతో పాటు…
రాష్ట్ర ప్రజల్లో వంద రోజుల పాలన పట్ల సానుకూల స్పందన ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ గాంధీభవన్‌లో పీఈసీ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందని, మనం దేశంలోనే మంచి ఫలితాలు సాధిస్తామని ఆయన అన్నారు. వంద రోజుల పాలన పట్ల ప్రజల్లో ఉన్న స్పందన ను ప్రచారంలో వాడుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. రైతు బంధు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 64 లక్షల 75…
రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గురువారంనాడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. జిల్లాలోని తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి, సింగారంలో ఎండిపోయిన వరి పంటలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు గాదరి కిషోర్‌తో కలిసి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం, కోనసీమలో ఎక్కడ చూసినా పచ్చని వ్యవసాయ పొలాలు, పచ్చని పచ్చిక బయళ్లే కనిపించాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ…