టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి రద్దు చేసుకున్నానని తెలపడంతో అభిమానులంతా షాక్ కు గురైయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ భవ్య బిష్ణోయ్, అతని కుటుంబానికి వ్యతిరేకంగా ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఆ కుటుంబాన్ని నిందిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, భవ్య బిష్ణోయ్ కుటుంబం రాజకీయ నేపథ్యం వున్నా కుటుంబం కావడంతో హేళన చేస్తూ ఇతర పార్టీల కార్యకర్తలు…
టాలీవుడ్ నటి మెహరీన్ పిర్జాదా ఇటీవల హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తుందనుకుంటే షాకింగ్ న్యూస్ ను చెప్పింది. తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ట్విటర్ వేదికగా మెహరీన్ స్వయంగా లేఖ ద్వారా వెల్లడించింది. ఇక నుంచి భవ్య బిష్ణోయ్, అతని కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండబోదని మెహరీన్ స్పష్టం చేసింది. ఇరువురు ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది.…