సాధారణంగా మనలో ఏజ్ పెరిగే కొద్ది జ్ఞాపక శక్తి తగ్గుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే చాలా మందికి ఈ మాటలతోనే సగం నిద్రను కొల్పోతుంటారు. వృద్ధాప్య దశలో జ్ఞాపక శక్తి తగ్గడం కామనే అని అంటున్నారు నిపుణులు.. మెదడులోని జ్ఞాపక కేంద్రమైన హిప్పోకాంపస్ ఏజ్ పెరిగే కొద్దీ కుంచించుకుపోవడం కూడా అందుకు కారణమవుతుంది. అయినప్పటికి అలా జరగకుండా ఆపవచ్చునని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. Read Also:Hot Water Bath Facility: వందే భారత్ స్లీపర్…
మన శరీరంలో అత్యంత ప్రభావవంతమైన అవయవం మెదడు. ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలను విశ్లేషించేదీ... నిర్ణయాలను చేసేది అదే. ఒక్కమాటలో చెప్పాలంటే మన శరీరంలో మెదడే హెడ్‌మాస్టర్. మన పూర్వీకులు చూడని ఎన్నో సంక్లిష్టతలను ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటోంది. ఫోన్లో నిరంతరం వచ్చిపడే నోటిఫికేషన్లు, ఆలోచనలు, పని సంస్కృతి వంటివి కుదురుగా నిలవనీయడం లేదు. దీంతో మెదడుపై ఒత్తిడి పడుతోంది. కాలక్రమంలో మెదడు మొద్దుబారి పోతుంది. మీ మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ చిట్కాలు పాటించండి..