ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఓ కారణం. మెదడులోని కణాలు నియంత్రించలేని విధంగా పెరిగినప్పుడే ఇది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ , డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం.