భారత సైన్యం అమ్ములపొదిలోని శక్తిమంతమైన ఆయుధంగా పరిగణించే బ్రహ్మోజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. బుధవారం భారత ఆర్మీ అధికారులు ఈ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవుల్లో విజయవంతంగా పరీక్షించారు. రష్యా సహకారంతో డీఆర్‌డీవో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణితో భూతలం నుంచి భూతలానికి, భూమి నుంచి యుద్ధ విమానాలు, యుద్ద నౌకల వంటి టార్గెట్లను ధ్వంసం చేయవచ్చు. తాజాగా బ్రహ్మోస్ మిస్సైల్ రేంజ్ పెరగ్గా.. ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా…
భారత్ అమ్ములపొదిలో మరో శక్తివంతమైన క్షిపణి చేరనుంది. బ్రహ్మోస్ క్షిపణి ఇప్పటివరకు 300 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను మాత్రమే చేధించగలదు. అయితే త్వరలోనే 800 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ అభివృద్ధి చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ శక్తివంతమైన క్షిపణిని గగనతలం నుంచి ప్రయోగించే విధంగా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన సంగతి…