IAS officer: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో AJAX (మధ్యప్రదేశ్ షెడ్యూల్డ్ కులాలు, తెగల అధికారులు, ఉద్యోగుల సంఘం) ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ప్రాంతీయ అధ్యక్షుడు, సీనియర్ IAS అధికారి సంతోష్ వర్మ వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వర్గాన్ని ఆగ్రహానికి గురి చేసింది.