వైఎస్‌ఆర్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. సరదా కోసం ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు కావడంతో మల్లెపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి . బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లిలో వేసవి సెలవులు కావడంతో ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సమీపంలోని బంధువుల ఇళ్ల దగ్గరకు వెళ్లి వెతికినా ఆచూకీ తెలియరాలేదు.
బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపికపై మళ్లీ వివాదం రాజుకుంటుంది. మఠాధిపతి ఎంపికపై హైకోర్టులో రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. తనపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఒప్పుకునే లాగా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. మఠాధిపతిగా ఎంపికైన వెంకటాద్రి స్వామి నియామకాన్ని నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు అని సమాచారం. వీలునామా ప్రకారం కాకుండా స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ అధికారులు మఠాధిపతిని ప్రకటించారని మారుతి మహాలక్ష్మమ్మ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.
కడప జిల్లా : ఎట్టకేలకు బ్రహ్మంగారి పీఠాధిపతి వివాదం ముగిసింది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి నియామకం అయ్యారు. దీంతో బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులంతా రాతపూర్వకంగా కూడా హామీ ఇచ్చారు. పీఠం చిక్కుముడి వీడటంతో బ్రహ్మంగారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. read also : హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. తెలంగాణలో మూడు రోజుల పాటు! పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి, ఉత్తరాధికారిగా…
రాష్ట్రంలో.. దేశంలో.. అంతెందుకు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత ఘటన చోటు చేసుకున్నా.. అది శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారు ముందే చెప్పారని చెబుతుంటారు.. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా విషయంలోనూ బ్రహ్మంగారు ముందే చెప్పారని ఆధారాలు చూపుతున్నారు.. కానీ, మరోవైపు బ్రహ్మంగారిమఠంలో మఠాధిపతి వ్యవహారం పెద్ద రచ్చగా మారడం చాలా మందిని విస్మయానికి గురిచేసింది.. పలు దపాలుగా చర్చల తర్వాత ఇవాళ కొలిక్కి వచ్చింది మఠాధిపతి వ్యవహారం… దీంతో.. బ్రహ్మంగారిమఠం మఠాధిపతి ఎంపిక పూర్తి అయినట్టే…
ఏపీలో గత కొన్ని రోజులుగా చర్చాంశనీయంగా మారిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని నిర్ణయించే అంశంపై మంత్రి వెలంపల్లి చర్యలు తీసుకుంటున్నారు. పీఠాధిపతి నియమాకాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని ధార్మిక పరిషత్తుకు మంత్రి వెలంపల్లి సూచించారు. పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ నిర్వహించేందుకు ప్రత్యేకాధికారిగా దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ను నియమించారు ధార్మిక పరిషత్. పీఠాధిపతి నియామకంపై వివిధ పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా…
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం తీవ్ర వివాదంగా మారిపోయింది.. దీంతో.. రంగంలోకి దిగుతున్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇవాళ బ్రహ్మంగారి మఠానికి వెళ్లనున్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి.. పీఠాధిపతి వ్యవహారం వివాదానికి దారి తీసిన నేపథ్యంలో మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది… పీఠాధిపతి ఎంపిక విషయంపై స్వయంగా రంగంలోకి దిగుతున్న మంత్రి.. బ్రహ్మంగారి వారసులతో చర్చించనున్నారు.. కుటుంబ సభ్యులతో విడివిడిగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.. స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి పీఠాధిపతి…
కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పరిస్థితులు టెన్షన్ టెన్షన్ గా ఉంది.కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు పోలీసులు. బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతుల బృందం పర్యటన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. అక్కడ చర్చలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఆలయ పరిసర ప్రాంతాల్లో గ్రామస్థులకు కూడా ఎలాంటి అనుమతి లేదని పోలీసులు హెచ్చరిక జారీ చేసారు. కానీ పీఠాధిపతుల రాకను వ్యతిరేకిస్తున్నారు రెండో భార్య మహాలక్ష్మమ్మ. ఇప్పటికే పీఠాధిపతుల బృందంపై డీజీపీకి ఫిర్యాదు చేసారు మహాలక్ష్మమ్మ. అయితే పెద్ద కుమారుడు వెంకటాద్రికి…
నేడు బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతుల బృందం పర్యటించనుంది. సామరస్యంగా పీఠాధిపతి వివాదం పరిష్కారం చేస్తామని అంటున్నారు పీఠాధిపతుల బృందం. కానీ వారి రాకను వ్యతిరేకిస్తున్నారు రెండో భార్య మహాలక్ష్మి. పీఠాధిపతులు వస్తున్న నేపథ్యంలో మఠం పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత ఏర్పాటు చేసారు పోలీసులు. ఇప్పటికే పీఠాధిపతుల బృందంపై డిజిపికి ఫిర్యాదు చేసారు మహాలక్ష్మి. అయితే బ్రహ్మంగారి మఠం వీరబ్రహ్మేంద్రస్వామి వారిని దర్శించుకున్నారు పీఠాధిపతుల బృందం. దర్శనం కోసం లోపలికి కొరకు పోలీసులు అనుమతి…
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. నేడు మఠం పీఠాధిపతి సమస్యను పరిష్కారం చేసేందుకు వస్తున్నారు పీఠాధిపతులు. కానీ వారి రాకను వ్యతిరేకిస్తున్నారు రెండో భార్య మహాలక్ష్మి. మొదటి భార్య పెద్ద కొడుకు వెంకటాద్రికే మొగ్గు చూపుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. వారు మఠం సందర్శనకు రావడానికి ఎలాంటి హక్కు లేదని అంటున్నారు. ఇక నుంచి శ్రీ బ్రహ్మంగారి మఠంను శివ మఠం గా మారుస్తారా… లేని గొడవలు సృష్టించేందుకే పీఠాధిపతులు వస్తున్నారు. పూర్వ పీఠాధిపతి…