రాష్ట్రంలో.. దేశంలో.. అంతెందుకు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత ఘటన చోటు చేసుకున్నా.. అది శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారు ముందే చెప్పారని చెబుతుంటారు.. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా విషయంలోనూ బ్రహ్మంగారు ముందే చెప్పారని ఆధారాలు చూపుతున్నారు.. కానీ, మరోవైపు బ్రహ్మంగారిమఠంలో మఠాధిపతి వ్యవహారం పెద్ద రచ్చగా మారడం చాలా మందిని విస్మయానికి గురిచేసింది.. పలు దపాలుగా చర్చల తర్వాత ఇవాళ కొలిక్కి వచ్చింది మఠాధిపతి వ్యవహారం… దీంతో.. బ్రహ్మంగారిమఠం మఠాధిపతి ఎంపిక పూర్తి అయినట్టే అని భావిస్తున్నారు.. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సారథ్యంలో కందిమల్లయ్యపల్లి సంస్థానం పుర ప్రజల సహకారంతో మఠాధిపతి ఎంపిక దాదాపు పూర్తి చేశారు.. పీఠాధిపతి ఎంపికపై ఏకాభిప్రాయానికి వచ్చారు కుటుంబ సభ్యులు.. దివంగత పీఠాధిపతి మొదటి భార్య మొదటి కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠాధిపతిగా ఎంపికకు సయోధ్య కుదిరింది… బ్రహ్మంగారిమఠం ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండవ కుమారుడు వీరభద్రయ్య నియామకం కాగా.. వీరిరువురి తదనంతరం మఠాధిపతిగా మారుతీ మహాలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం ఇవ్వాలని.. ఇరు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థుల సమక్షంలో జరిగిన చర్చల్లో నిర్ణయానికి వచ్చారు..