ప్రముఖ బిలినీయర్, దేశంలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానిపై ప్రముఖ అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై విచారణకు కొన్ని కమిటీలు కూడా వేశారు. సెబీ వీటిపై పూర్తి ఆధారాలతో నివేదికలు సమర్పించనుంది. ఆగస్టు 15 నాటికే వీటికి సంబంధించి పూర్తి నివేదికను సెబీ సుప్రీంకోర్టుకు అందిచాల్సి ఉండగా ఇంకా కొన్ని విషయాలను పరిశీలించడానికి మరికొంత సమయం కావాలని సెబీ కోరింది.…