హైదరాబాద్ మెట్రోలో టికెటింగ్ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు రెండో రోజు కూడా విధులు బహిష్కరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. హైదరాబాద్ మెట్రో రైల్వేలో టికెటింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిన్నటి నుంచి విధులకు దూరంగా ఉన్నారు.