గణతంత్ర దినోత్సవం ప్రతి చోటా ఘనంగా జరిగింది. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి.. మన జాతియావత్తూ 74 ఏళ్లుగా తలెత్తుకుని తిరిగేలా మన రాజ్యాంగం మనకు భరోసా ఇచ్చిన రోజిది. ఒంగోలు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హై టీ కార్యక్రమానికి జిల్లా ప్రజా ప్రతినిధులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ హై టీ కార్యక్రమానికి రావాలని పలుసార్లు కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్లు చేసినా స్పందించలేదు స్థానిక ప్రజా ప్రతినిధులు.
Read Also: Pathaan: ఒక్కరోజులోనే వంద కోట్ల క్లబ్ లో పఠాన్.. అదిరా.. షారుఖ్ రేంజ్
మినీ స్టేడియంలో ఆజాదీకా అమృత్ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా ప్రజా ప్రతినిధులు రాకపోవటంతో కార్యక్రమాన్ని రద్దు చేశారు కలెక్టర్ దినేష్ కుమార్. ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉదయం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ జెండా ఆవిష్కరణ అనంతరం ఆనవాయితీగా ప్రజా ప్రతినిధులను వేదిక పైకి ఆహ్వానించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈకార్యక్రమంలో తమను పట్టించుకోకపోవడంతో అల్పాహారం కూడా తీసుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. తమను జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అవమానించటంపై కలెక్టర్ దినేష్ కుమార్ పై ఫిర్యాదు చేసే యోచనలో ప్రజా ప్రతినిధులు వున్నారు. జిల్లాలో కలెక్టర్ వర్సెస్ ప్రజా ప్రతినిధుల వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇలాంటి కార్యక్రమంలో పట్టింపులకు పోవడంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
Read Also: Sai Dharam Tej: నరేష్ కొడుకు కోసం మెగా మేనల్లుడు సాయం