తండ్రి తన గారాల బిడ్డకోసం ఎంతో ఇష్టంతో విదేశాల నుంచి తెచ్చిన చాక్లెట్ తన బిడ్డ ప్రాణాలే బలి గొంటుందని ఊహించలేక పోయాడు. నాన్న తెచ్చిన చాక్లెట్ లను తీసుకుని చిన్నారి స్కూల్ లో తిండామనుకున్నాడు.
కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలోకి ప్రవేశించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల్లో కలియతిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
కని, పెంచి, పెద్దచేసిన తల్లిని... కర్కశంగా ప్రాణాలు తీశాడో కుమారుడు. నవమాసాలు మోసి సాధిన కొడుకే తన పాలిట యముడవుతాడని ఆ తల్లి ఊహించలేకపోయింది. ఓ కసాయి కొడుకు మేక కోసం కన్నతల్లినే కడతేర్చాడు.
ఓ చిన్న పిల్లవాడి విన్యాసాలను తెలిపే వీడియోను తన సోషల్ మీడియా యాండిల్‌లో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా.. ఆ వీడియోలో.. రోడ్డుపై ఓ పదేళ్ల బాలుడు జిమ్నాస్టిక్ స్టంట్లు చేస్తున్నాడు.. అలవోకగా పల్టీలు కొడుతూ, జంప్ చేస్తూ ఔరా! అనిపిస్తున్నాడు.
నూడిల్స్ ఓ బాలుడు ప్రాణాలు తీశాయి.. ఎంతో ఇష్టంగా తన కుమారుడికి నూడిల్స్ పెట్టింది ఆ తల్లి.. అవి తిన్న కాసేపటికే ఆ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు.. వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లినా ఆ బాలుడి ప్రాణాలు మాత్రం దక్కకపోవడం విషాదంగా మారింది.. తమిళనాడులో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చి జిల్లా సమయపురానికి చెందిన శేఖర్-మహాలక్ష్మి దంపతులకు.. రెండేళ్ల బాలుడు ఉన్నాడు.. అయితే, కొంత కాలంగా ఆ బాలుడు అలెర్జీతో బాధపడుతున్నారు..…
ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఓ దివ్యాంగ బాలుడు నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి క్షేమంగా బయటపడ్డాడు. బోరుబావిలో పడ్డ 12 ఏళ్ల బాలుడు రాహుల్ సాహు కోసం ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపాలో నిర్వహించిన ఆపరేషన్ పూర్తయ్యింది. దాదాపు 104 గంటల పాటు శ్రమించి.. ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రాహుల్ సాహును బోరుబావి నుంచి బయటికి తీసి.. ప్రత్యేక అంబులెన్స్‌లో బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఐసీయూలో రాహుల్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.…
కొందరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణ సంకటంగా మారుతోంది. ఇంటిలో ఉన్న సంపు పై కప్పు మూయకపోవడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ లోని గుండ్లపోచంపల్లి ఎస్సి కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో 2 ఏళ్ళ బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే.. ఆ సమయంలో అక్కడే తెరిచి ఉన్న నీటి సంప్‌లో పడి 2 ఏళ్ల బాలుడు కృష్ణ దాస్ మృతి చెందాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు…
హైదరాబాద్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 781 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా రికవరీ అయి డిశ్చార్జ్ అయిన వారు 241మంది వున్నారు. తెలంగాణ దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 5వ స్థానంలో వుంది. తెలంగాణలో ఇప్పటివరకూ 62 కేసులు నమోదయ్యాయి. రికవరీ అయినవారు 10 మంది. ఇదిలా వుంటే శంషాబాద్‌లో దిగిన ఓ బాలుడికి ఒమిక్రాన్ సోకింది. దుబాయ్ నుంచి వచ్చిన బాలుడికి ఒమిక్రాన్ ముగ్గురు ప్రైమరీ కాంటాక్టులకు సోకింది వైరస్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని…
హైదరాబాద్ లోని చందానగర్ పాపిరెడ్డి కాలనీ లో విషాదం చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పాపిరెడీ కాలనీ లోని ఓ సెప్టిక్ ట్యాంక్ లో పడి బాలుడు మృతి చెందాడు. నిన్న గాలి పటం ఎగురవేస్తూ పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో పడి అరవింద్ (7) అనే బాలుడు మృతి చెందాడు. నిన్నటి నుండి బాలుడు కనిపించడం లేదంటూ చందనగర్ పోలీసులకు బాలుడి తల్లి తండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన…