Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boy Commits Suicide Due To Loan Apps Harassment In East Godavari: పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు మాత్రం తగ్గడం లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. వీరి వేధింపులు తాళలేక మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఓ యువకుడు బలి అయ్యాడు. తాను తీసుకున్న అమౌంట్ కంటే ఎక్కువ మొత్తం తిరిగిచ్చినా.. లోన్ యాప్ నిర్వాహకులు ఆ యువకుడ్ని హింసించారు. అసభ్య పదజాలంతో సందేశాలు పంపుతూ వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ చూడమని కోరినందుకు వ్యక్తిపై దాడి
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
తూర్పుగోదావరి జిల్లాలోని కడియం గ్రామానికి చెందిన సురకాసుల శ్రీను దర్జీకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకడైన హరికృష్ణ (18) ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది జనవరి 28న తన వ్యక్తిగత అవసరాల కోసం.. ఆన్‌లైన్‌లో హరి కొన్ని యాప్స్ నుంచి లోన్ తీసుకున్నాడు. ఒక యాప్ లోన్ తీర్చేందుకు మరొక యాప్ నుంచి డబ్బులు తీసుకుంటూ వచ్చాడు. అనంతరం రూ.1.50 లక్షలను యాప్‌లకు చెల్లించాడు. అయినా సరే.. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు ఆడలేదు. వాళ్లు అసభ్య పదజాలంతో సందేశాలు పంపుతూ, అతడ్ని దారుణంగా వేధించారు. దాంతో ఆ అబ్బాయి పోలీసుల్ని ఆశ్రయించాడు. వాళ్లు రంగంలోకి దిగి వార్నింగ్ ఇవ్వడంతో.. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాత్కాలికంగా నిలిచాయి.
Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. సెకండ్ యంగెస్ట్ ప్లేయర్
హరికృష్ణ మరోసారి తన తండ్రి పేరు మీద లోన్ తీసుకోవాలని భావించాడు. శనివారం సాయంత్రం షాపులో పనిచేసుకుంటున్న తండ్రిని ఇంటికి పిలిచి, తండ్రి ఫోటోను తీసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి తండ్రి వెళ్లిపోయాడు. ఇంతలో పెద్ద కుమారుడు కార్తీక్ వచ్చి.. తమ్ముడు ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయాడని చెప్పాడు. తండ్రి ఇంటికొచ్చి అతడ్ని ఫోన్‌ను పరిశీలించగా.. అందులో హరికృష్ణ తల భాగంతో నగ్న చిత్రాలు, అసభ్య పదజాలంతో వాట్సప్‌లో మెసేజ్‌లు ఉండటాన్ని చూశాడు. అది చూసి తట్టుకోలేక హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి కారణమైన లోన్ యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!