ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ఓ టైమ్ లైనులో ప్రకటిస్తాం.. పరిష్కరిస్తామని సీఎం చెప్పారని జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల్లో కొంత మేర మిశ్రమ స్పందన వచ్చిందని, అయినా ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి టైమ్ బౌండ్ పెట్టడం సంతోషమన్నారు. హెచ్‌ఆర్ఏ, పెన్షనర్లకు అదనపు పెన్షన్ విషయంపై సీఎంఓ అధికారులతో మాట్లాడామని, హెచ్‌ఆర్ఏ, అదనపు పెన్షన్ విషయంలో సీఎస్ కమిటీ సిఫార్సులను పట్టించుకోవద్దని కోరామన్నారు. హెచ్‌ఆర్ఏ విషయంలో…
ఎన్నో రోజులుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటనపై నేడు తెరపడింది. ఈ రోజు సీఎం జగన్ 11వ పీఆర్సీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పదవీ విరమణ వయస్సు పెంపు ఊహించలేదని ఆయన అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా మేం అడగకపోయినా ఇంటి స్థలం విషయంలో నిర్ణయం తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.…
ఏపీపీఆర్సీపీపై సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధికారులు కమిటీ ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకించినట్లు ఆయన వెల్లడించారు. గత పది పీఆర్సీల్లో ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తగ్గలేదని, హెచ్ ఆర్ఏ పై అసంబద్ధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారన్నారు. విశాఖ, విజయవాడ, నెల్లూరు టౌన్ లో తప్ప ఎక్కడా 16 శాతం హెచ్ఆర్ఏ వర్తించదని, పెన్షనర్లకు సంబంధించి 70 ఏళ్లకు అదనపు…
ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికే ఊ అంటున్నాయా? మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అంటున్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేశాయా? అంటే అవుననే అనిపిస్తోంది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ వైఖరి ఉద్యోగ సంఘాలకు మంట పుట్టిస్తోంది. దీంతో తమ డిమాండ్ల సాధనకు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశాయి ఉద్యోగ సంఘాలు. జనవరి 9 నుంచి ఆందోళన బాట చేపట్టాలని భావిస్తున్నాయి. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారాంశాన్ని మాత్రమే ఇచ్చారని, సీఎస్…
ఏపీలో పీఆర్సీపై నెలకొన్న సందిగ్ధత వీడలేదు. అమరావతిలోని సచివాలయంలో ముగిసింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. వచ్చే వారం ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ జరిగే అవకాశం వుంది. ఆ తర్వాతే ఫిట్ మెంట్, ఇతర ఆర్థిక అంశాల పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా వుంటేఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస రావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు సమావేశం అనంతరం మాట్లాడారు. మా 71 డిమాండ్ల పై అధికారులు…
పీఆర్‌ఎస్‌తో పాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలకు దిగారు. అయితే ఇటీవల సీఎస్ సమీర్ శర్మ కమిటీ పీఆర్‌సీపై నివేదికను సీఎం జగన్‌కు అందజేసింది. అయితే సీఎస్ కమిటీ ఫిట్‌మెంట్ 14.29 ఇవ్వాలని నివేదికలో పేర్కొంది. దీనిపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరుపుతున్నారు. అయితే సీఎస్ కమిటీ సిఫార్సు మేరకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు…
11వ పీఆర్‌సీపై ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్ని రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న ఏపీ సీఎస్ సమీర్‌శర్మ పీఆర్‌సీపై నివేదికను సీఎం జగన్ మెహన్‌రెడ్డి అందజేశారు. మూడు రోజుల్లో సీఎం జగన్ పీఆర్‌సీపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. మా…
ఈనెల ఏడవ తేదీ నుంచి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులు అందరూ విజయవంతం చేయాలి అని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. మేము దాచుకున్న, మాకు హక్కుగా రావాల్సిన డబ్బులు కొంతకాలంగా రావడం లేదు. గతంలో ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నెరవేరడం లేదు అన్నారు. పీఆర్సీ నివేదిక లో ఉన్న అంశాలు కమిటీ సభ్యులు తెలిసినట్లు లేదు. పీఆర్సీ లో ఫిట్మెంట్ అంశం ఒక్కటే కాదు.. ఉద్యోగులకు సంబంధించిన చాలా అంశాలు ముడిపడి ఉంటాయి.…
ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమైన ఏపీ ఉద్యోగ సంఘాలు తమ కార్యాచరణ ప్రకటించాయి. ఇక తాజాగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఉద్యమానికి వెళ్లాలని ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తుంది. ఉద్యోగుల కోసం ఆత్మాభిమానం చంపుకుని అందరిదగ్గరకూ తిరిగాం. ఉద్యోగులు దాచుకున్న 1600 కోట్లు ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. దాని పై స్పష్టత ఇవ్వాలి అని అన్నారు. ఉద్యోగ సంఘాలకు విలువ లేకుండా చూస్తున్నారు. ఆర్థిక మంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఉద్యోగులను…