ఈనెల 8వ తేదీనుంచి ఏపీలో ఉద్యోగ సంఘాల ఉద్యమం ప్రారంభం కాబోతోంది. ఉద్యోగ సంఘాలలో ఐక్యత లేకపోయినా ఉద్యోగులు అంతా సమిష్టిగా పోరాడి హక్కులు సాధించుకోవాలంటున్నారు ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు,ప్రదర్శనలు చేస్తామని ప్రకటించినా జగన్ సర్కారులో కదలిక లేదంటున్నారు. ఇక నుంచి 10నుంచి ఐదు గంటల వరకు మాత్రమే ఉద్యోగం చేస్తామని బొప్పరాజు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగుల నిరసన జగన్ సర్కార్ కు ఈ పరిణామం చెంపపెట్టులా మారిందంటున్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను జగన్ మోసారంటున్నారు. ఐఆర్ 27 శాతం ప్రకటించారు.. ఫిట్‌మెంట్ 23 శాతానికి తగ్గించారని ఆగ్రహంతో ఉన్నారు ఉద్యోగులు.. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమం చేస్తామని ముందే హెచ్చరించారు ఉద్యోగ సంఘాల నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగుల ఆగ్రహం జగన్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 13వ తేదీన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మా ఉద్యోగ , ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక ఆర్ధికేతర సమస్యలను 4 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదంటున్నారు ఏపిజేఏసి అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. మా ఉద్యమానికి ఏపి సిపిఎస్ఏ కూడా మద్దతు ప్రకటించిందన్నారు.
Read Also:Pan Card Aadhaar link: పాన్ కార్డుతో ఆధార్ లింక్.. లాస్ట్ డేట్ వచ్చేస్తోంది
జగన్ ప్రభుత్వం ఉద్యోగ వర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలి..హామీ ఇచ్చి మరిచిపోయిన అంశాలను గుర్తుచేయడానికే మా ఉద్యమం అన్నారాయన. డిఏ ఏరియర్స్ లక్షలాది రూపాయల ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. మూడు డిఏలు ఇప్పటికీ చెల్లించలేదు….రిటైర్ అయిన వారికి బకాయి చెల్లించలేదు. ఏడాదిగా పోలీస్ లకు సరండర్ లీవులకు చెల్లింపులు ఇవ్వలేదు….ఏ హామీ ఇవ్వని రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేస్తే ..వారంరోజుల్లో రద్దు చేస్తామని చెప్పి ఏం చేశారని బొప్పరాజు ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ హామీని ప్రభుత్వం విస్మరించింది. ఎల్లుండి నుంచి స్వఛ్ఛందంగా పాల్గొనాలి….మాలో ఐక్యత వుందని చెప్పాలి…ఏపి ఎన్జీఓ జేఏసి కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు ప్రజల మద్దతు కావాలన్నారు ఆర్టీసీ జెఏసీ నేత వాలిశెట్టి దామోదర్. లిఖిత పూర్వక హామీ లభించే వరకు ఈసారి చర్చలకు ఆస్కారమే లేదన్నారు.
Read Also: Pan Card Aadhaar link: పాన్ కార్డుతో ఆధార్ లింక్.. లాస్ట్ డేట్ వచ్చేస్తోంది