విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 2వ తేదీన బుక్ ఫెస్టివల్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ పుస్తక మహోత్సవం రేపటితో ముగియనుంది. పుస్తక మహోత్సవం ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది.
ఈ రోజు ఉదయమే పుస్తక మహోత్సవాన్ని ప్రత్యేకంగా సందర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉదయం 2 గంటల పాటు పవన్ కల్యాణ్ కోసం స్టాళ్లను తెరిచి ఉంచాలని ఆయన నిర్వాహకులను విజ్ఞప్తి చేశారు.. దీంతో, కేవలం పవన్ కల్యాణ్ కోసం కొన్ని స్టాళ్లు ఆయన అడిగినవి తెరిచి ఉంచారు.. పవన్ కల్యాణ్ ఆయా స్టాళ్లను సందర్శిస్తూ.. 6, 9 తరగతులు పుస్తకాలు, డిక్షనరీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ పుస్తకాలతో పాటుగా తెలుగులో అనువదించిన ఖురాన్ గ్రంథం కూడా…