లక్సర్ బోనాలు నిన్న సికింద్రాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం తెల్లవారుజామునుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, సారె, సమర్పించారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తొలి బోనం సమర్పించగా, ఎమ్మెల్సీ కవిత 2000 మంది మహిళలతో ఊరేగింపుగా వచ్చి మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈనేపథ్యంలో.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు…
ఈ ఏడాది బోనాల ఉత్సవాల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.. ఆ నిధులను బోనాలకు ముందే దేవాలయాలకు అందిస్తామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..