తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం నడుస్తోంది. బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ నేతల మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా వరి ధాన్యం కొనుగోలుపై తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలయింది. పిల్ దాఖలు చేశాడు లా విద్యార్థి బొమ్మనగరి శ్రీకర్. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని…