బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదుల తొలి టార్గెట్ బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని పేల్చడమేనని వెల్లడించింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం రోజే బీజేపీ కార్యాలయాన్ని ఐఈడీతో పేల్చేందుకు విఫలయత్నం చేసినట్లు తెలిపింది.