Bomb threats: గుజరాత్ రాజ్‌కోట్ నగరంలోని పలు హోటళ్లకు వరసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలోని ఫైవ్ స్టార్ హోటళ్ల సహా 10 హోటల్లకు శనివారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపులు ఎదుర్కొన్న హోటళ్లలో ఇంపీరియల్ ప్యాలెస్, సయాజీ హోటల్, సీజన్స్ హోటల్, గ్రాండ్ రీజెన్సీ వంటి ప్రసిద్ధ హోటళ్లు ఉన్నాయి. దీపావళి సందర్భంగా నగరం అంతా కోలాహలంగా ఉన్న సమయంలో ఈ బెదిరింపులు స్థానిక ప్రజల్లో ఆందోళన పెంచాయి.