ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి కొద్ది దూరంలో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు పౌరులు మరణించగా.. అనేక మంది గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడి చేసిన వ్యక్తిని ఆఫ్ఘన్ దళాలు గుర్తించాయి.
Bomb blast in Kabul: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాజధాని కాబూల్ లోని ప్రభుత్వ కాంప్లెక్స్ లోని మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. తాలిబాన్ నేతృత్వంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలోని మసీదులో బుధవారం పేలుడు సంభవించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.