ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా బోకారోలో ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. సమావేశానికి ముందుగా ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించి.. అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు.
Bird Flu Alert In Jharkhand: జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ కోళ్ల ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. బొకారో జిల్లాలోని ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రతమత్తం అయింది. లోహాంచల్ లోని ప్రసిద్ధ ‘‘కడక్ నాథ్’’ కోళ్ల మాంసంలో హెచ్5ఎన్1 వేరియంట్ ఉన్నట్లు నిర్థారించారు.