నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ హత్యయత్నం కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు అల్తాప్ తండ్రి అబ్దుల్ బాకీ ఖురాన్ తలపై పెట్టుకుని చేసిన వ్యాఖ్యలపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఓ వీడియోను విడుదల చేశాడు. నా హత్యకు కుట్ర చేశారు.. సొంత పార్టీ కౌన్సిలర్లు, ఎంఐఎం నేతలు ముఠాగా ఏర్పడారు అని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45లో జరిగిన ప్రమాదం సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంలో మహిళ పడేయడంతోనే చిన్నారి చనిపోయిందంటున్నారు ఎమ్మెల్యే షకీల్. జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్ ఈ విధంగా స్పందించారు. ప్రమాదం జరిగిన తర్వాతే ఆ మహిళే పాపను కింద పడేసిందని, ఆమె పడేయడంతోనే చిన్నారి చనిపోయిందని షకీల్ తెలిపారు. కుటుంబాన్ని ఆదుకోవాలని మీర్జా ఫ్యామిలీకి చెప్పానని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. పోలీసులు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘గురువారం యాక్సిడెంట్…