తెలంగాణలో సంచలనం కలిగించిన బోధన్ సంఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి ,నిజామాబాద్ కమీషనర్ కే ఆర్ నాగరాజులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, కమిషనర్ ఇతర పోలీసు అధికారులు బోధన్ లోనే ఉండి పరిస్థితులు సమీక్షిస్తున్నారు అని డీజీపీ మహేందర్ రెడ్డి హోం మంత్రికి వివరించారు. ఉద్రిక్తతలకు దారి తీసిన పరిస్థితులపై హోం మంత్రి మహమూద్ అలీ ఆరాతీశారు. ఘర్షణ వాతావరణాన్ని అదుపు…