కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ పై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఫిజిక్స్ పేపర్ లీకేజీ ఘటన, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై సీరియస్ అయ్యింది. ఎస్ యూ పరీక్షల విభాగం అధికారులను వివరణ కోరారు ఛైర్మెన్ పాపిరెడ్డి. సెల్ ఫోన్ ఆధారంగా లికేజీకి పాల్పడ్డ వారిని గుర్తించినట్లు సమాచారం. దాంతో ప్రభుత్వ ప్రవేటు కళాశాలల నిర్వహకుల్లో ఆందోళన మొదలయ్యింది. అయితే ఓ ప్రవేటు కాలేజీకి చెందిన విద్యార్థులు సెల్ ఫోన్ చూస్తూ ప్రశ్నలకు జవాబులు…
తెలంగాణ రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశమైంది. 11 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం కోసం విధివిధానాలు రూపొందించనున్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించనున్నారు. ఫ్యాకల్టీ నియామకం స్టేట్ వైడ్ గా (కేంద్రీకృతంగా) అన్ని యూనివర్సిటీ లకు కలిపి, లేదా యూనివర్సిటీ వైస్ గా చేయాలా అనే దానిపై వీసీల అభిప్రాయం తీసుకుంది…