కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952కు ఇటీవల కొన్ని సవరణలు చేసింది. సెన్సార్ అయిన సినిమాలను సైతం తిరిగి చూసే అధికారం, రీ-ఎగ్జామిన్ చేసే అధికారం కేంద్రానికి ఉండేలా చేసింది. అయితే… ఇలాంటి పలు అంశాలతో రూపొందిన ఇండియన్ సినిమాటోగ్రఫీ అమాండ్ మెంట్ బిల్ 2021ని కేంద్రం ఆమోదించింది. చిత్రం ఏమంటే ఇప్పటి వరకూ ఉన్న ట్రిబ్యునల్ ను ఈ సవరణల ద్వారా కేంద్రం రద్దు చేసింది. దాంతో సెన్సార్ సభ్యుల కోరలకు మరింత పదను ఏర్పడినట్టు…