తెలుగు సినిమా పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పేరొందిన పూరీ జగన్నాధ్, తాజాగా లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో జరిపిన భేటీతో వార్తల్లో నిలిచారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పూరీ టీం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, సినీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. విజయ్ సేతుపతితో పూరీ రూపొందిస్తున్న కొత్త పాన్-ఇండియా చిత్రం కోసం ఈ భేటీ జరిగి ఉంటుందని, విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కానున్నారని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. Also…