హైదరాబాద్ రహదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో ఘోర ప్రమాదాల తర్వాత ఇష్టమొచ్చినట్టుగా స్టిక్కర్లు వేసుకుని తిరిగేవారిపై చర్యలు చేపట్టారు. వీఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రెస్, అడ్వకేట్ల పేరుతో స్టిక్కర్లు అంటించినవారు తప్పనసరిగా సరైన గుర్తింపు కార్డులు తమ వద్ద ఉంచుకోవాలన్నారు పోలీసులు. లేదంటే సంబంధిత వెహికల్ ని సీజ్ చేస్తామన్నారు. కారులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు. ఈ కారు యజమాని ఆర్సీ పేపర్లు, డ్రైవింగ్ లైసెన్సులు, బ్లాక్ స్టిక్కరింగ్ నిరోధానికి చర్యలు చేపట్టారు. కారు…