బుద్ధ భవన్ లో కోదండరాం మౌన దీక్ష చేపట్టారు. తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మునుగోడులో జరగుతున్న ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల నియమాల ఉల్లంఘన పై తెలంగాణ జన సమితి పార్టీ అధినేత, ప్రోఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేపట్టారు.
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాకరేపుతోంది.. ఏ పార్టీ ఇస్తుంది.. ఏ పార్టీ పంచుతుంది అనే విషయం పక్కన పెడితే.. మద్యం ఏరులైపారుతోంది.. ఇక డబ్బులు వెదజల్లుతున్నాయి ఆయా పార్టీలు.. ఈ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు… ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి కాకుండా కార్పొరేట్ శక్తులకు కాపలాదారుడు అయ్యాడని ఆరోపించిన ఆయన.. ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయి..…
గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదని స్పష్టం చేశారు. గవర్నర్ గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. గెలిచేందుకు ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం మరింత హీటెక్కింది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
చేనేత కార్మికుల సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీదృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలంటూ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్ కార్డును కూడా రాశారు కేటీఆర్.. చేనేత కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన కేటీఆర్, ప్రధానంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ…
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరు ఊపందుకున్నాయి. పార్టీలన్నీ మునుగోడులో తమ సత్తా చాటుకునేందుకు బాహాబాహీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో.. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం ఉప్పరిగూడెంలో మంత్రి తలసాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి.. ఎప్పుడు ఎవరు సీఎం అవుతారో..? ఎప్పుడు ఎవరు తిరుగుబాటు చేస్తారో..? ఏ పార్టీ ఎమ్మెల్యే సీఎం అవుతారో కూడా చెప్పడం కొన్నిసార్లు కష్టమే.. మహా రాజకీయాలపై ఓ కథనం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.. బీజేపీతో చేతులు కలిపిన శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసి సఫలం అయ్యారు.. ఆ తర్వాత బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి పీఠాన్నా ఎక్కారు.. అయితే, ఇప్పుడు…
మునుగోడు ఉపఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు కమలదళంలో ఉన్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈనెల ఆయన బుధవారం 26న బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారు. అయితే అదేరోజు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కి సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసిన ఆడియో వైరల్ కావడం పై ఎఐసిసి సిరీయస్ అయ్యింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని AICC నోటీస్ లో పేర్కొంది.