జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రచ్చగా మారాయి.. తన విశాఖ పర్యటనలో ఆంక్షలు, జనసేన నేతలపై కేసులపై భగ్గుమన్న పవన్ కల్యాణ్.. అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ.. చెప్పు విప్పి మరీ చూపించారు.. అంతేకాదు.. తన మూడు పెళ్లిళ్లపై అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు కూడా కౌంటర్ ఇస్తూ.. వీడాకులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకున్నాను.. భరణం ఇచ్చాను..…
మునుగోడులో టీఆర్ఎస్ గెలవడం ఖాయమని కరీంనగర్ జిల్లా మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఉచితాలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై జనం నిరసనతో ఉన్నారని తెలిపారు. ట్యాక్సీ కట్టే సంపన్న వర్గాలకు మద్దతుగా మోడీ మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని అన్నారు.
భద్రాద్రి రాముడు ఆస్తులను మాఫియా ముఠా నుంచి కాపాడాలంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. భద్రాద్రి రాముడికి చెందిన భూములు రాష్ట్ర విభజన సందర్భంగా మన రాష్ట్రానికి బదిలీ అయిన 7 మండలాల ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో పరిధిలోకి వచ్చాయి.. జిల్లాల విభజనలో అవి శ్రీ అల్లూరి మన్యం జిల్లా, పాడేరు పరిధిలోకి వచ్చాయని.. ఈ భూములపై కన్నేసిన ఒక ముఠాలోని కొందరు, భాగాలుగా ఏర్పడి మాఫియాగా…
తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు హాట్ టాపిక్. ఉప ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు మిగిలి ఉంది. దీంతో.. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు వేగం పెంచాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ అయితే మంత్రులను, ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు వేగవంతం చేసింది.
బీజేపీకి గుడ్‌బై చెప్పి తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్.. ఈ మేరకు బీజేపీ జీతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు..
మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సిద్ధం అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ.. వచ్చే నెలలో ఆయన విశాఖలో పర్యటించనున్నారు.. నవంబర్ 11వ తేదీన విశాఖ రానున్న ఆయన.. రూ.400 కోట్లతో విశాఖలో చేపట్టనున్న రైల్వే నవీకరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.. రైల్వే నవీకరణ పనులతో పాటు.. పలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు భారత ప్రధాని… ఈ అధికారిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి…
కాంగ్రెస్ మాజీ నేత విజయ్ సింగ్ మంకోటియా మంగళవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమల తీర్థం పుచ్చుకున్నారు.
ధరణి పోర్టల్ తంటాలను తెంచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు మునుగోడు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. దేశ సమైక్యత కోసమే రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర అని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలపై రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని తెలిపారు.