తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీల్లో ఫిరాయింపులు కొత్తేమీ కావు. కాకపోతే.. ఈ సారి ఫిరాయింపులంటూ మొయినాబాద్‌లోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌస్ ఘటన రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. తాజాగా.. మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో ఆడియో బయటకొచ్చింది. పైలెట్ రోహిత్‌రెడ్డి, రామచంద్ర భారతి మధ్య ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. ఫాంహౌస్ మీటింగ్‌కు ముందు రామచంద్ర భారతితో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మాట్లాడారు.
రామచంద్రభారతి :
మీరు నెంబర్-2 ముందు ఎమ్మెల్యేల పేర్లు చెబుతారా?
పైలెట్ రోహిత్ రెడ్డి :
ఈ విషయం బయటపడితే మా పని అయిపోతుంది
పైలెట్ రోహిత్ రెడ్డి :
మా సీఎం గురించి మీకు తెలుసు కదా.. ఆయన చాలా దూకుడుగా ఉంటారు
పైలెట్ రోహిత్ రెడ్డి :
ప్రస్తుతం మేము ముగ్గురం రెడీగా ఉన్నాం
రామచంద్రభారతి :
మా ఆర్గనైజింగ్ సెక్రటరీ BL సంతోష్
రామచంద్రభారతి :
ప్రభుత్వ ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తారు
రామచంద్రభారతి :
నెం.1, నెం.2.. BL సంతోష్ ఇంటికి వచ్చి అన్నింటిపై చర్చిస్తారు
రామచంద్రభారతి :
ఏ నిర్ణయమైనా BL సంతోషే తీసుకుంటారు
రామచంద్రభారతి :
BL సంతోష్‌తో కలిసి మనం నెంబర్-2 దగ్గరకు వెళ్దాం
రామచంద్రభారతి :
ఒకరిద్దరు ముందుగా వస్తే బాగుంటుంది
నందు:
25న గ్రహణం ఉంది కాబట్టి.. ఆ తర్వాత కలుద్దాం
పైలెట్ రోహిత్ రెడ్డి :
స్వామీజీ మీరు క్లారిటీ తీసుకోండి.. నేను మరికొంత మందికోసం ప్రయత్నిస్తా
రామచంద్రభారతి :
26 తర్వాత ఎక్కడైనా కలుద్దాం.. హైదరాబాద్‌లో మాత్రం వద్దు
రామచంద్రభారతి :
నేను డైరెక్ట్‌గా BLసంతోష్‌తోనే మాట్లాడతా.. మధ్యవర్తులెవరూ లేరు
పైలెట్ రోహిత్ రెడ్డి :
దయచేసి ఇదంతా టాప్‌సీక్రెట్‌గా పెట్టండి, లేకపోతే నాపనైపోతుంది
రామచంద్రభారతి :
ఏమైనా చిన్న తేడా వచ్చినా మేము కవర్ చేస్తాం
రామచంద్రభారతి :
మేము కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తాం