మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ సమయం తేదీ దగ్గర పడుతోంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. మనుగోడు ఓటర్లను తమవైపు మళ్లించుకునేందుకు శక్తికి మించి శ్రమిస్తున్నాయి. అయితే.. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గనికి ఏమి చేయబోతున్నారన్నారు. మునుగోడు గడ్డ పైనా అడుగుపెడుతున్న సీఎం ఏమి చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమి నెరవేర్చరో చెప్పాలన్నారు. రాజగోపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు. అంతేకాకుండా.. ‘ముందు దీని పైనా మాట్లాడాలి. నీ రెండు మూడు పథకాలు తప్ప కేంద్రం ఇచ్చిన నిధులు ఏమిటి మీరు ఇచ్చిన నిధులు ఎంటో స్పష్టం చేయాలి. ఇస్తే ఇచ్చినట్లు చెప్పాలి. కానీ ఇవ్వకుంటే ఇవ్వలేదు అని చెప్పండి. అభివృద్ధి పైనా చర్చ జరగాలి. అభివృద్ధి కోసం వచ్చిన ఎన్నికలు కాబట్టి వాటి పైనా చెప్పాలి.. కేసీఆర్ బహిరంగ సభ లో ఏడుస్తాడాట.. ఏడ్పు నటించి సెంటిమేంట్ తో ఓట్లు సాధించేలా నటించేందుకు రెడీ అయ్యాడు. ఆవేదనతో కళ్ళకు నీళ్లు వస్తే బాధ అంటారు. దొంగ ఏడ్పు మోసం పూరిత ఏడ్పు అంటారు. చిల్లర గాళ్లకు మేము రావడం ఎందుకు మీరు చాలు అని చెప్పరు.. అందుకే లైట్ తీసుకున్నారు. కేసీఆర్ ఆయనకు ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు.. ఆయన బిడ్డ పైనా ఆరోపణలు రాగానే.. సీబీఐకి అనుమతులు రద్దు చేశారు. ఆగస్టులో ఈ జీవో ఇచ్చి కనీసం బయట పెట్టలేదు.. సీబీఐ అంటే ఎందుకు భయం.. యాదాద్రికి రమ్మన్నాం రాలేదు..
Also Read : PM Modi in Mann ki Baat: అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతాలు చేస్తోంది..
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అని అడిగాము ఏమీ చేయలేదు.. విచారణ జరపకపోతే ఎలా నిజాలు బయటకు వస్తాయి..
4 ఎమ్మెల్యేలను బయటకు రాకుండా ఎందుకు బందిస్తున్నావు.. ఈరోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళుతాడట.. పైలెట్ రోహిత్ రెడ్డి ని నిపార్టీలోకి ఎన్ని డబ్బులు ఇచ్చి చేర్చుకున్నావో మహేందర్ రెడ్డిని అడిగితే చెప్పారా. ఇప్పటి వరకు 33 మందిని ఇతర పార్టు నేతలను మీ పార్టీలో చేర్చుకున్నారు. ఎన్ని డబ్బులు ఇచ్చారు.. 33 మందిని సంతల్లో పశువులు కొన్నట్లు కొన్నావు వీళ్లకు ఎన్ని డబ్బులు ఇచ్చావు. వీళ్ళను చేర్చుకుంటే మాకు ఏమి లాభం.. ప్రజలు నీ ఆరోపణలను పాటించుకోవడం లేదు. ఈ రోజు సభలో మీరు ప్రమాణం చేయండి.. మీరు ఇచ్చిన హామీలు నేరవేర్చినారని ప్రమాణం చేస్తారా.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం చండూర్ సభ వేదిక పైన కేటీఆర్ కానీ సీఎం కానీ ప్రమాణం చేస్తారా. ముఖ్య మంత్రి వచ్చేటప్పుడు డబ్బులు సంచులు తెస్తున్నాడట. మంత్రుల కాన్వాయ్ లోనైనా ముఖ్యమంత్రి వచ్చే హెలికాప్టర్‌లోనైనా ముఠా తరలిస్తున్నారట.’ అంటూ విమర్శలు గుప్పించారు బండి సంజయ్.