ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ్టితో ప్రచారానికి తెరపడనుంది.. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మినహా శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. కాగా, నాల్గో విడత ఎన్నికలకు గత నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది.. ఇక, ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి.. చివరి రోజు కూడా ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు.. వైసీపీ, టీడీపీ, జనసేన చీఫ్లు ప్రచారంలో పాల్గొననున్నారు..
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా కచ్చితమైన పోలింగ్ శాతం వివరాలను తెలిపేలా ఆదేశించాలని కోరుతూ.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
లోక్ సభ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు ప్రధాని ఈరోజు జార్ఖండ్లోని సిమారియాకు వెళ్తున్నారు. ముర్వేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో ప్రసంగించడం ఇదే తొలిసారి.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడతకు ఈసీ ఏర్పాట్లుచేస్తోంది. సోమవారమే నాల్గో విడత పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో బీజేపీ పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్ రిజర్వ్ పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించింది. పంజాబ్ రాష్ట్ర సఫాయి కరంచారి కమిషన్కు ఛైర్మన్ అయిన గెజ్జా రామ్ వాల్మీకిని పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్ రిజర్వ్ పార్లమెంటరీ నియోజకవర్గం బరిలో దింపింది. ఇది కూడా చదవండి: UP: ఇద్దరు పురుషులతో హోటల్…
తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా.. ఆర్ ఆర్ ట్యాక్స్.. లిక్కర్ స్కాం అంటున్నారు.. ఈ నేపథ్యంలో అవినీతికి వ్యతిరేకంగా ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనే ప్రశ్నకు ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘అవినీతి ఏ రాష్ట్రంలో ఉన్నా ఉపేక్షించేది లేదు. దేశ ఉజ్వల భవిష్యత్ కోసం అవినీతి అనే రోగాన్ని వదిలించాలి. అవినీతి నిర్మూలన అసంభవమేమీ కాదు. 15 ఏళ్ల క్రితం ప్రతీదీ బ్లాక్ మార్కెట్ అన్నట్టుగానే…
Congress: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని శుద్ధి చేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్కు సంబంధించి ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ఉజ్వల భవిష్యత్ కోసం మీ కమిట్ మెంట్ ఎంతో స్పెషల్ అని, హైదరాబాద్ ఇంకా మరెంతో ప్రత్యేకం.. మరీ ప్రత్యేకంగా ఈ వేదిక ఇంకా ప్రత్యేకమన్నారు. పదేండ్ల క్రితం ఇక్కడే ఒక సభ పెట్టాను.. ఆ సభకు టికెట్ పెట్టామని, ఈ సభ ఒక టర్నింగ్ పాయింట్…
తెలుగు న్యూస్ ఛానెళ్ల చరిత్రలోనే తొలిసారిగా ప్రధాని మోడీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తోంది ఎన్టీవీ.. తన మనసులోని మాటను మోడీ ఎన్టీవీతో పంచుకున్నారు.. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి.. తెలంగాణలో బీజేపీ హవా కొనసాగుతుందా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ రాజకీయాలకు సంబంధించిన ఎన్నో అంశాలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ..
దుర్మార్గమైన కాంగ్రెస్, బీఆర్ఎస్లు చెరో వైపు సత్తా లేక పిరికిపందాల్ల బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలు నవ్వుకుంటున్నారని, రేవంత్, రాహుల్, కెసిఆర్ ల సర్టిఫికెట్ బీజేపీ కి అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి. మాకు తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలని, మోడీ లేని భారతాన్ని చూడలేమన్నారు. ఎవరు బాధపడ్డ తెలంగాణ అభివృద్ధి కి కమిట్ మెంట్ తో పనిచేస్తామన్నారు. గాడిద గుడ్డు ను నెత్తిన పెట్టుకొని…
Asaduddin Owaisi: కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ప్రియాంకాగా గాంధీ మాట్లాడుతూ.. కీలక నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం, బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు.