ఏపీలో పొత్తులపై వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ.. గతంలో మన మిత్రపక్షంగా ఉన్న టీడీపీ సరిగా పట్టించుకోలేదని, బీజేపీ కార్యకర్తలు ఇచ్చిన రిప్రజెంటేషన్లను మన మిత్రపక్షంగా ఉన్న వాళ్లు చించేసేవారని ఆమె అన్నారు. పరిస్థితి ఈ విధంగా ఉందని నాడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్తే.. మీ బలమెంత..? అని అమిత్ షా ప్రశ్నించారని ఆమె అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం…