తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు మరువలేనివి అని పేర్కొన్నారు బీజేపీ ఏపీ ఛీప్ దగ్గుబాటి పురంధేశ్వరి.. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకి సంతాపం ప్రకటించిన ఆమె.. ఈనాడు అధినేత రామోజీ రావు లేరన్న వార్త తెలుగు జాతిని శోకసంద్రంలో ముంచిందన్నారు.
బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీకి బయలుదేరారు. హస్తినలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలను పురంధేశ్వరి కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు పురంధేశ్వరి వివరించనున్నట్లు తెలుస్తోంది.