ప్రధాన మంత్రితో పోల్చితే రాష్ట్రపతి ఎన్నిక పెద్దగా ఉత్కంఠ రేపదు. అలాంటి ఉత్కంఠ భరిత వాతారణం ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది. 1969, 1997 రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మాత్రమే దేశం అలాంటి ఉత్కంఠను చూసింది. చాలా ఏళ్ల తరువాత ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు పోటా పోటీగా జరగనున్నాయి. అధికార ఎన్‌డీఏ కూటమికి సంఖ్యాబలం కాస్త తక్కువగా ఉండటమే ఈ ఉత్కంఠకు కారణం అని చెప్పవచ్చు. 2017ఎన్నికల మాదిరిగా ఈసారి అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు…