కరోనా మహమ్మారి ఏ దేశాన్ని రాష్ట్రాన్ని వదలిపెట్టడం లేదు.. కాస్త అజాగ్రత్తగా ఉన్న ఏ వ్యక్తిని కూడా వదలకుండా పనిపట్టేస్తోంది… అయితే, ఆ మహమ్మారి ఏమీ చేయలేదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్.. బీజేపీ కార్యకర్తలకు కరోనా వాలంటీర్లుగా పనిచేసేందుకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యకరమానికి హాజరైన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివుడు, పార్టీ చీఫ్‌గా విష్ణువు ఉండగా ఇక మధ్యప్రదేశ్‌ను మహమ్మారి ఏం చేస్తుంది?…