బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , విజయశాంతి తదితరులు హాజరయ్యారు. గత కొంతకాలంగా టీ- బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
BJP: భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం జూన్ 11న తమ ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఎంపీ, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.
తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని చేవెళ్లలో సభ నిర్వహిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీ నాయకులను ప్రశ్నించారు. శనివారం చేవెళ్ల నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
BJP : దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటుు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు కొల్లాపూర్‌లో పర్యటించనున్నారు. బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జి ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కోసం గత నెల 8వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపును పురస్కరించుకుని జులై 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలుగా ఉంది. ఈ సభకు ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. చరిత్రలో ఈ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. సభకు 10 లక్షల మందికిపైగా…
తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందా? రాబోయే రోజుల్లో కమలదళం దూకుడు పెంచుతుందా? అంటే అవుననే అనిపిస్తోంది.2023 ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే స్కెచ్చేస్తోంది. మరో వైపు బీజేపీ జాతీయ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జూలైలో జరగబోతున్నాయి. దీనికి సబంధించి కమలదళం ఇప్పటినుంచి ఏర్పాట్లు మొదలుపెట్టింది. తెలంగాణపై బిజెపి కేంద్ర నాయకత్వం సీరియస్‌గా ఫోకస్ చేసింది. ఎలాగైనా కాషాయ జెండా ను ఎగిరే యాలని వ్యూహ రచన చేస్తున్నారు..…
2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. జనంలోకి వెళ్ళేందుకు యాత్రలతో బీజేపీ నేతలు బిజీ అవుతున్నారు. ఇప్పటికే రెండు ప్రజాసంగ్రాయాత్రలు చేశారు బండి సంజయ్. తెలంగాణలో మరో విడత ప్రజా సంగ్రామయాత్రకు రెడీ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోంది. తెలంగాణలో ఆత్మహత్యలే లేవన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ వక్రభాష్యాన్ని చూసి…