బీజేపీ నేత వివేక్ వెంకట్ స్వామి తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. మహబూబాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎంపీ వివేక్ బీజేపీ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్ల చేయాలన్నారు. తమను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరుని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రధాని ముందు చూపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందన్నారు. థర్డ్ ఫ్రంట్ విషయం…
తెలంగాణలో జరిగిన హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలపై ప్రధాని, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతృప్తిని వ్యక్తం చేస్తూ , రాష్ట్రపార్టీ నేతలను అభినందించారు. తెలంగాణలో, దక్షిణభారత దేశంలో బీజేపి బలపడుతుందన్న విశ్వాసాన్ని ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పి.నడ్డా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ ఉపఎన్నికలలో ఓట్లశాతం పెరుగుదలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. “దళితబంధు” పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు బీజేపీ నేతలు. కేంద్ర…
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. రేపు నిర్మల్ వస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అమిత్‌షా పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమలనాధులు. వెయ్యి ఉరుల మర్రి సమీపంలో భారీబహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సభాస్థలిని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి నాందేడ్ రానున్న ఆయన.. అక్కడ నుంచి నిర్మల్ వస్తారు.. వెయ్యి…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోలీసుల సర్వేలోనూ 70 శాతం ఈటల రాజేందరే గెలుస్తాడని తేలిందని వ్యాఖ్యానించారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్… రెండ్రోజుల తర్వాత మళ్లీ పాదయాత్ర చేస్తానని.. ఎక్కడ ఆపానో అక్కడే ప్రారంభిస్తా.. రెండు రోజులు హుజురాబాద్‌లో అందుబాటులో ఉంటా.. పరిస్థితులు సమీక్షిస్తా.. కార్యకర్తలు, నాయకులను కలుస్తా అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఈటల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 18 ఏళ్ల చరిత్రలో సీరియస్ గా పని…