Etela Rajender: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు.. అదే కూలిపోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender Comments On TRS Government And CM KCR: తెలంగాణలో ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము కష్టపడాల్సిన అవసరం లేదని, దానికదే కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తాజాగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు, సీఎం కేసీఆర్‌కు మధ్య ఆత్మీయ బంధం లేదని.. కేవలం అవసరాల సంబంధం మాత్రమే ఉందన్నారు. ఇది అపనమ్మకంతో పరస్పర అవసరాల కోసం ఏర్పడిన ప్రభుత్వమని అన్నారు. సొంత పార్టీ వారినే పార్టీలో చేరుతున్నట్టు మళ్లీ కండువాలు కప్పుతున్నారని.. సొంత పార్టీ ప్రజాప్రతినిధుల్ని, నాయకుల్ని కొనుక్కోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యిందని, అది చతికిల పడిందని, ఇప్పుడప్పుడే లేచే పరిస్థితి ఆ పార్టీకి లేదని ఈటెల రాజేందర్ చెప్పారు. 21వ తేదీన మీటింగ్ పెట్టుకుంటామని, అమిత్ షా కూడా వస్తారని ముందే తాము ప్రకటించామని.. కానీ గిల్లికజ్జాలు పెట్టుకున్నట్టు ఒక రోజు ముందు సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. 2014 వరకు తెలంగాణ గాంధీగా పిలవబడ్డ కేసీఆర్.. 8 ఏళ్ల పాలనలో తెలంగాణ ద్రోహిగా ఎందుకు పిలవబడుతున్నారో వారే తెలుసుకోవాలని సూచించారు. ఎవరెన్ని వ్యూహాలు రచించినా, ఎలాంటి ఎత్తుగడలు వేసుకున్నా.. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!