బీజేపీ నేతల పై ఎమ్మెల్యే జోగు రామన్న ఫైర్ అయ్యారు. మా సొమ్ము అయితే మీది సోకులు అంటూ సెటైర్ వేశారు. ఢిల్లీ లో ఏక్ నంబర్ బామ్టే ఆదిలాబాద్ లో సాత్ నంబర్ బామ్టే లున్నారన్నారు. అప్పులు చేసి అయినా మేము అభివృద్ధి పనులు చేశాము.. మీరు చేశారా? అంటూ ప్రశ్నించారు.
ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. అధికారంను అడ్డంపెట్టుకోని అరెస్ట్‌లు చేయిస్తున్నారని బీజేపీ నేతలు రాస్తారోకో చేపట్టగా ఆసమయంలో మహిళ ఎస్సై పై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మహిళ సంఘాలు, టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేత వ్యాఖ్యలపై మండిపడ్డారు. అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ నేత ఎవ్వరు ఏమన్నారు…ఆ ఇష్యూ ఏంటీ.. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ జైనాథ్ ఎస్ఐ పెర్సిస్ బిట్లనుద్దేశించి…