నగరం లోపల, వెలుపల పెద్ద ఎత్తున అక్రమ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా పురపాలక శాఖ మంత్రికి పట్టదని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహసంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు వివక్ష, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రధాన కూడల్లో టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీసీసీ ప్రభాకర్. ఇతర రాజకీయ పార్టీలు కడితే ఫైన్ లు వేస్తారు… కేసులు పెడతారని, అవే నియమ నిబంధనలు అధికార పార్టీ కి వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. పురపాలక శాఖ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారిస్తున్నారన ఆయన మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో…