ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు.. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేన రెడ్డి పీఏను అధికారులు విచారించారు. విచారణ సమయంలో ఫోన్ ట్యాప్ వ్యవహారం బయటపడింది.. ప్రస్తుతం ఇంద్రసేనరెడ్డి త్రిపుర గవర్నర్‌గా ఉన్నారు.