గతంలో అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తలుగా నిలిచేవని… కానీ ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక సంస్కరణలు తెచ్చారని బీజీపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భాజపా గోదావరి గర్జన సభకు నడ్డా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలుగు సంస్కృతికి ఈ ప్రాంతం ప్రతిబింబంగా ఉందన్నారు.…