బీజేపీలో కొన్నేళ్లుగా నరేంద్ర మోదీకి ఎదురులేకుండా పోతోంది. ఆయన ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగుతోంది. మోదీ ఇమేజ్ కారణంగానే బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోని వచ్చిందని ఆపార్టీ నేతలు భావిస్తుంటారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోని, ప్రభుత్వంలోగానీ మాట్లాడే సాహసం చేయలేక పోతున్నారు. ఒకవేళ ఎవరైనా మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ల పదవి ఊడటమో.. లేదంటే పార్టీ నుంచి బహిష్కరించడమో చేయడం వంటి సంఘటనలు కన్పిస్తుంటాయి. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక క్యాబినెట్లో…