కొంపెళ్ళ మాధవీలత.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనం ఆమె. ప్రత్యేకించి బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్. హిందుత్వను భుజానికెత్తుకోవడంతో పాటు అదే సమయంలో... పస్మందా ముస్లింలకు సేవ చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చారామె. అంతేకాదు.. పార్టీ పరంగా.. లోకల్‌తో సంబంధం లేకుండా ఢిల్లీ లింక్స్‌తో బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ టికెట్ తెచ్చుకున్న మహిళ నేత. ఆ ఊపుతోనే హైదరాబాదు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి ఓల్డ్‌సిటీ విషయంలో ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నారు.