ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార బీజేడీ ఆధిక్యానికి చెక్ పడేలా కనిపిస్తోంది. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది.
PM Modi: ఒడిశా అసెంబ్లీతో పాటు అధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బీజేపీ నేతలు బిజూ జనతాదళ్(బీజేడీ) చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోంది.
ఒడిశాలో బీజేడీతో బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చేసింది. గత కొద్ది రోజులుగా బీజేడీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోతుందని వార్తలు వినిపించాయి. ఇటీవల ఒడిశాలో ప్రధాని మోడీ పర్యటనతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశాలో అధికార బీజేడీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఒడియా నటుడు అరిందమ్ రాయ్ శుక్రవారం బిజూ జనతాదళ్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రతిపక్ష బీజేపీలో చేరారు.
Odisha: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీల మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీలు కూడా పొత్తుపై చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగి పోటీ చేస్తుందని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై పార్టీ పార్లమెంటరీ నిర్ణయమే అంతిమం అంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ గురువారం అన్నారు. గురువారం కేంద్ర…
NDA: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కి చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈమేరకు చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరిలోనూ ఇదే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. 15 ఏళ్ల తర్వాత బీజేడీ ఎన్డీయే కూటమిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసిపోటీ చేస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారికంగా పొత్తుపై ఎలాంటి ప్రకటన రానప్పటికీ, రెండు పార్టీల నేతలు మాత్రం పొత్తుపై సంకేతాలు ఇస్తున్నారు.…
Naveen Patnaik: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా రాజకీయంగా రచ్చరచ్చగా మారింది. ఇప్పటికే ఈ ప్రారంభోత్సవానికి 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు, డీఎంకే, టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు ప్రారంభోత్సవానికి రాబోమని చెప్పాయి. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని ప్రధాని కొత్త భవనాన్ని ప్రారంభించం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Naveen Patnaik: ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ అధినేత విపక్షాల పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ విపక్షాలతో కలిసి పోటీ చేయమని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీ ఒంటరిగానే పోలీ చేస్తుందని ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని డిమాండ్ల గురించి ప్రధాని మోడీని కలిసినట్లు చెప్పారు.